TECHNOLOGY
🚀 What We Do
At [allinone.buzz], we explore the latest in technology — from AI, gadgets, and smartphones to digital trends, apps, and innovations shaping the future. Our goal is to make tech simple, useful, and exciting for everyone.
Innovating Today for a Smarter Tomorrow
Whether you’re a tech enthusiast, a casual user, or a business owner — we bring you reviews, tutorials, and insights that help you stay ahead in this fast-changing digital world.

పోస్టల్ సేవలు ఇక మరింత సులభం.. వచ్చేసింది ‘డాక్ సేవా’ యాప్
భారత తపాలా శాఖ తన సేవలను ఆధునికీకరించే దిశగా కీలక ముందడుగు వేసింది. సాంకేతికతను అందిపుచ్చుకుంటూ వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని అందించేందుకు ‘డాక్ సేవా’ పేరిట సరికొత్త మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించింది. ఇప్పటివరకు వినియోగంలో ఉన్న పాత ‘పోస్ట్ ఇన్ఫో’ యాప్ స్థానంలో ఈ కొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది.
సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పోస్టల్ టెక్నాలజీ (CEPT) రూపొందించిన ఈ ‘డాక్ సేవా’ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆధునిక సాఫ్ట్వేర్, సులభమైన ఇంటర్ఫేస్తో ఈ యాప్ వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉంటుందని తపాలా శాఖ తెలిపింది. ఈ యాప్ ద్వారా వినియోగదారులు పోస్ట్ ఆఫీసులకు వెళ్లకుండానే తమ పనులను చక్కబెట్టుకోవచ్చు.
ఒకే యాప్‌లో 8 రకాల సేవలు
ఈ ఒక్క యాప్‌తో దాదాపు 8 రకాల కీలక సేవలను పొందవచ్చు. స్పీడ్ పోస్ట్, రిజిస్టర్డ్ పోస్ట్, పార్శిళ్లను రియల్ టైమ్‌లో ట్రాక్ చేయడం, సమీపంలోని పోస్ట్ ఆఫీస్ వివరాలు, పనివేళలు తెలుసుకోవడం వంటివి చాలా సులభం. అంతేకాకుండా పంపించాలనుకుంటున్న పార్శిల్ బరువు, గమ్యస్థానాన్ని బట్టి పోస్టేజ్ ఛార్జీలను ముందుగానే లెక్కించుకోవచ్చు.
ఇక, ఆర్థిక సేవలు కూడా ఈ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (PLI), రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (RPLI) ప్రీమియంలను లెక్కించుకోవచ్చు. సుకన్య సమృద్ధి యోజన, రికరింగ్ డిపాజిట్ వంటి పొదుపు పథకాలపై వచ్చే వడ్డీ వివరాలను కూడా తెలుసుకునే సౌకర్యం కల్పించారు. కార్పొరేట్ కస్టమర్ల కోసం ప్రత్యేక సేవలు కూడా ఇందులో ఉన్నాయి.
‘తపాలా శాఖ 2.0’ లక్ష్యాల్లో భాగంగా తీసుకొచ్చిన ఈ ‘డాక్ సేవా’ యాప్.. పోస్టల్ సేవలను డిజిటల్ యుగంలోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న ‘డిజిటల్ ఇండియా’ లక్ష్యానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది.
e Aadhaar App: ఆధార్ కి సంబంధించిన అన్ని అప్డేట్స్ కోసం సింగిల్ యాప్.!
ప్రభుత్వం ఇప్పుడు కంప్లీట్ సొల్యూషన్ యాప్ అందించే అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది
ఆధార్ అప్డేట్ చేసేందుకు వీలుగా కొత్త సూపర్ యాప్ తీసుకురావడానికి పని చేస్తున్నట్లు చెబుతన్నారు
m ఆధార్ తో పోలిస్తే , ఈ అప్ కమింగ్ యాప్ లో మరిన్ని ఫీచర్స్ ఉంటాయని కూడా చెబుతున్నారు
e Aadhaar App: దేశంలో ప్రధాన ప్రమాణ పాత్రంగా కొనసాగుతున్న ఆధార్ కోసం అనేక అప్డేట్స్ మరియు ఫీచర్స్ అందించిన ప్రభుత్వం ఇప్పుడు కంప్లీట్ సొల్యూషన్ యాప్ అందించే అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా ఆన్లైన్ ఆధార్ అప్డేట్ ప్రోసెస్ ని మరింత సులభం చేసిన UIDAI మరింత సులభంగా ఆధార్ అప్డేట్ చేసేందుకు వీలుగా కొత్త సూపర్ యాప్ తీసుకురావడానికి పని చేస్తున్నట్లు చెబుతన్నారు. ఇప్పుడు కొనసాగుతున్న m ఆధార్ తో పోలిస్తే , ఈ అప్ కమింగ్ యాప్ లో మరిన్ని ఫీచర్స్ ఉంటాయని కూడా చెబుతున్నారు.
e Aadhaar App:
ఆధార్ సర్వీస్ లను మరింత సులభతరం చేయడానికి UIDAI (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) రూపొందిస్తున్న సరికొత్త యాప్ ఈ ఆధార్ యాప్. ఈ కొత్త యాప్ తో ఆధార్ కార్డు కలిగిన వారు సొంతంగా ఆధార్ కి సంబంధించిన అప్డేట్స్ ను నిర్వహించడానికి వీలువుతుంది. అంటే, డెమోగ్రాఫిక్ వివరాలైన పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ మరియు అడ్రస్ వంటి అని వివరాలు యూజర్లు నేరుగా ఈ యాప్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు.
ప్రసుతం ప్రభుత్వం అందించిన m ఆధార్ యాప్ తో పోలిస్తే ఇది మరింత అడ్వాన్స్ గా ఉంటుంది మరియు ఎక్కువ ఫీచర్స్ కలిగి వుండే అవకాశం ఉంటుంది. ఈ అప్ కమింగ్ యాప్ లో సెక్యూరిటీ కోసం యాప్‌లో ఫేస్ రికాగ్నిజెషన్ మరియు QR కోడ్ స్కాన్ వంటి టెక్నాలజీలు ఉపయోగించబడతాయి. అంతేకాదు, యూజర్ డేటా ప్రైవసీ కాపాడేందుకు AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీ కూడా ఉపయోగించే అవకాశం ఉంటుంది.
e Aadhaar App: ఎప్పుడు వస్తుంది?
ఈ ఆధార్ యాప్ లాంచ్ గురించి ప్రస్తుతం ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రాలేదు. అయితే, 2025 చివరి నాటికి ఈ యాప్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇదే కనుక నిజం అయితే డిసెంబర్ చివరి నరికి ఈ యాప్ అందుబాటులోకి రావచ్చు.
ఇక భద్రత విషయానికి వస్తే, ఈ యాప్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉపయోగిస్తుంది. అంతేకాదు, ఇందులో ఉన్న QR కోడ్ మరియు Face ID వెరిఫికేషన్ భద్రతల వల్ల మీ ఆధార్ ని ఇతరులు దుర్వినియోగం చేయడం సాధ్యం అవుతుంది. అలాగే, OTP ఆధారిత వెరిఫికేషన్ తో మీ డేటా చాలా సురక్షితంగా ఉంటుంది.
ఇక ఈ కొత్త యాప్ ద్వారా ఆధార్ సర్వీస్ ను మరింత ఉన్నతమైన శిఖరాలకు తీసుకువెళ్లడానికి UIDAI యోచిస్తోంది. ఆధార్ అప్డేట్ కోసం ఆన్లైన్ సెంటర్స్ మరియు ఆధార్ కేంద్రాలు సందర్శించాల్సిన పని కూడా ఉండదు. త్వరలో అందుబాటులోకి రానున్న ఈ సూపర్ యాప్, ప్రతి భారతీయుడికి ఆధార్ అనుభవాన్ని మరింత సులభతరం చేయనుంది.
