ENTERTAINMENT


ఈ వారం ఓటీటీలోకి స్పెషల్ గా 4 సినిమాలు, ఓ వెబ్ సిరీస్.. క్రైమ్, సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్లు.. రొమాంటిక్ మూవీస్ |
బిజీగా ఉన్న ఈ ఓటీటీ వీక్ కొత్త సినిమాలను తెస్తుంది. క్రైమ్, సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ల నుంచి రొమాంటిక్ సినిమాల వరకూ డిజిటల్ స్ట్రీమింగ్ కు రాబోతున్నాయి. వీటిల్లో ఈ 4 సినిమాలు, ఓ సిరీస్ స్పెషల్ గా ఉన్నాయి. వీటిపై ఓ లుక్కేయండి.
కొత్త వారం వచ్చిందంటే ఓటీటీలోకి కొత్త సినిమాలు, సిరీస్ లు వచ్చి ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తూనే ఉంటాయి. ఈ వారం కూడా ఓటీటీలోకి చాలా సినిమాలు, సిరీస్ లు రాబోతున్నాయి. వీటిల్లో ఈ నాలుగు సినిమాలు, ఓ వెబ్ సిరీస్ చాలా స్పెషల్ గా ఉన్నాయి. అవేంటో ఓ సారి చూసేయండి.
ఢిల్లీ క్రైమ్ సీజన్ 3
ఓటీటీలో పాపులర్ అయిన సిరీస్ ఢిల్లీ క్రైమ్. ఈ సిరీస్ నుంచి ఇప్పుడు సీజన్ 3 వచ్చేస్తోంది. ఇది నెట్ఫ్లిక్స్ ఓటీటీలోకి రాబోతుంది. నవంబర్ 13 నుంచి స్ట్రీమింగ్ కానుంది. షెఫాలీ షా ప్రశంసలు పొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా కొత్త సీజన్ లో డిఐజి వర్తికా చతుర్వేదిగా తిరిగి వచ్చింది. ఇది వదిలేస్తున్న శిశువుల, అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా కేసు చుట్టూ తిరుగుతుంది.
జాలీ ఎల్ ఎల్ బి 3
జాలీ ఎల్ ఎల్ బి అంటూ కామెడీ సందడి చేశాడు అక్షయ్ కుమార్. ఈ మూవీ పార్ట్ 3 ఇప్పుడు ఓటీటీలో అడుగుపెట్టనుంది. జాలీ ఎల్ ఎల్ ఎల్ బి 3 నవంబర్ 14న నెట్ఫ్లిక్స్ తో పాటు జియోహాట్ స్టార్ లో కూడా రిలీజ్ కానుంది. అక్షయ్ కుమార్ వర్సెస్ అర్షద్ వార్సీ లీగల్ ఫైట్ కడుపుబ్బా నవ్వించనుంది. ఇందులో సౌరభ్ శుక్లా, హుమా ఖురేషి, అమృతా రావు తదితరులు కూడా నటించారు.
జురాసిక్ వరల్డ్: రీబర్త్
ఇది జురాసిక్ వరల్డ్ లో వచ్చిన మరో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్. నవంబర్ 14న డిస్నీ + హాట్ స్టార్ ఓటీటీలో రిలీజ్ కానుంది. గారెత్ ఎడ్వర్డ్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జురాసిక్ వరల్డ్ డొమినియన్ కు స్వతంత్ర సీక్వెల్ గా పనిచేస్తుంది. కొత్త సాహసాలు, ప్రమాదాలతో డైనోసార్ సాగాను విస్తరిస్తుంది.
తెలుసు కదా
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన లేటెస్ట్ రొమాంటిక్ మూవీ ‘తెలుసు కదా’. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో సిద్ధుతో పాటు రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి నటించారు. ఇద్దరమ్మాయిల మధ్య చిక్కుకున్న లవర్ గా సిద్ధు నటించాడు. ఇది నవంబర్ 14న నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ కానుంది. నీరజా కోన దర్శకత్వం వహించిన తెలుగు రొమాంటిక్ డ్రామా ఇది.
డ్యూడ్
ప్రదీప్ రంగనాథన్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘డ్యూడ్’. ఇది కూడా నవంబర్ 14 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇది కూడా ట్రయాంగిల్ లవ్ స్టోరీ. జెన్ జెడ్ రొమాంటిక్ మూవీగా గుర్తింపు పొందింది. ఈ సినిమాలో మమితా బైజు, శరత్ కుమార్, నేహా శెట్టి తదితరులు నటించారు.
